ETV Bharat / state

24 గంటల తాగునీటి సరఫరా .. మరింత బలోపేతం వైపు అడుగులు - తెలంగాణ వార్తలు

వరంగల్‌ త్రినగరి మహా నగరంగా శరవేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత రెండో పెద్ద నగరంగా పేరుగాంచింది. నగర జనాభా ప్రస్తుతం 11 లక్షల పైచిలుకు ఉండగా, 2050 నాటికి 20 లక్షలు దాటతారని ఓ అంచనా. ప్రజలందరి దాహం తీర్చేందుకు గ్రేటర్‌ వరంగల్‌ బృహత్తర ప్రణాళిక రచించింది. అమృత్‌, అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకం ద్వారా విజన్‌- 2048 లక్ష్యంగా తాగునీటి సరఫరా పనులు చేపట్టింది. నగరంలో ప్రతి చివరి ఇంటి వరకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో పనులు చేపట్టింది. ఈనెల 12న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ రోజూ తాగునీటి సరఫరాను ప్రారంభించారు. అయినా ఇప్పటికీ చాలా కాలనీలకు మురికి నీరు వస్తోంది. అనేక కాలనీలకు పైపు లైన్లు లేవు. అమృత్‌ పథకంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందినప్పుడే కల సాకారమవుతుంది.

drinking water distribution, warangal urban district  water
వరంగల్​లో తాగునీటి సరఫరా, వరంగల్​ వాటర్
author img

By

Published : Apr 25, 2021, 3:55 PM IST

వరంగల్​లో తాగునీరు

నిజాం కాలంలోనే వరంగల్‌ పట్టణ ప్రజల దాహం తీర్చేందుకు బాటలు పడ్డాయి. నగరం కంటే 30- 40 మీటర్ల ఎత్తులో ఉన్న ధర్మసాగర్‌ చెరువును ఆ కాలంలోనే తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. ఒక టీఎంసీ నీళ్లను వాడుకునేందుకు ప్రతిపాదించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 110 కిలోమీటర్ల నుంచి గోదావరి నదీ జలాలు పంపింగ్‌ పద్ధతిన ధర్మసాగర్‌ జలాశయానికి వస్తాయి. ఐదేళ్లుగా నగర ప్రజల దాహం తీరుస్తోంది. రోజూ 170 ఎంఎల్‌డీ నీరు గ్రావిటీ ద్వారా ఫిల్టర్‌ బెడ్లకు చేరుతోంది. ఆరేళ్ల క్రితం ఎండాకాలంలో హన్మకొండ వడ్డేపల్లి చెరువు, వరంగల్‌ భద్రకాళి చెరువు ద్వారా తాగునీరు అందించే వారు. ప్రస్తుతం ధర్మసాగరు రిజర్వాయరే నీటి అవసరాలు తీరుస్తోంది. నగర విస్తీర్ణం, పెరుగుతున్న జనాభాకనుగుణంగా తగిన ప్రణాళిక ఉంది. 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదారమ్మ గలగలా పారుకుంటూ నగర ప్రజల దాహం తీర్చుతోంది. నగరానికి సరఫరా అయ్యే జలం ఎంతో విలువైందో అర్థం చేసుకోవచ్ఛు.

జనాభాకు అనుగుణంగా..

  • వరంగల్‌ నగర విస్తరణ, జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని కరీంనగర్‌ లోయరు మానేరు డ్యాం నుంచి ధర్మసాగర్‌ వరకు 1400, 2000 ఎంఎం డయా పైపులైన్లు వేశారు. కొంత భాగం పెండింగ్‌లో ఉంది. ఇదీ పూర్తయితే దేవాదుల, ఎల్‌ఎండీ ద్వారా రా వాటర్‌ వస్తుంది.

వచ్చే 30 ఏళ్లలో నగర జనాభా 20 లక్షలు దాటుతుందని అంచనా. 320.48 ఎంఎల్‌డీలు అవసరముంటాయి. 2033 వరకు 231.28 ఎల్‌ఎల్‌డీకి ఢోకా లేదు. అదనంగా మరో రెండు ఫిల్టర్‌బెడ్లు ప్రతిపాదించారు.

తాగునీటి సరఫరా

వృథా శాతం తగ్గాలి

నగరంలో తాగునీటి వృథా ఎక్కువగానే ఉంది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ సర్వే చేపట్టింది. లీకేజీలు, అక్రమ నల్లా కనెక్షన్ల ద్వారా సరఫరా మొత్తంలో 10 శాతం వరకు వృథా అవుతుందని లెక్క తేల్చారు. ప్రస్తుతం 186 ఎంఎల్‌డీల నీటిని వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో 18 ఎంఎల్‌డీల నీరు వృథా అవుతుందని అంచనా వేశారు.

అద్దె ట్యాంకర్ల తొలగింపు

ఇక్కట్లకు చెక్

నగరంలో సుమారు 65 పైపులైన్లు లేని కాలనీలు ఉంటాయి. 54 అద్దె ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించే వారు. రోజూ 360 ట్రిప్పులు వేసే వారు. అద్దెల వ్యయం ఏటా రూ.2 కోట్ల పైనే ఉంటోంది. అమృత్‌, అర్బన్‌ మిషన్‌ భగీరథ పనులు పూర్తవ్వడంతో అద్దె ట్యాంకర్లు సగానికి తగ్గించారు. 27 కొనసాగిస్తున్నారు. ఎండాకాలం తర్వాత 15 తొలగించేందుకు ప్రతిపాదించారు.

నమ్మకం కలిగించాలి..

టి.మంజుల, గిర్మాజిపేట

గత కొన్ని రోజులుగా రంగు మారిన నీరు వస్తోంది. నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలి. కలుషిత నీరు రాకుండా చూడాలి. లీకేజీలు అరికట్టాలి. రోజూ నల్లా నీళ్లు వస్తాయనే నమ్మకం కలిగించాలి. నెల రోజులుగా ఫర్వాలేదు.

--టి.మంజుల, గిర్మాజిపేట

సమయపాలనతో మేలు

సీహెచ్‌.రమాదేవి, పాతబీటు బజారు

నల్లా నీళ్లు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదు. తాగునీటి సరఫరాకు సమయపాలన ఉండాలి. కుళాయి వస్తుందని ముందస్తుగా సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు వచ్చే విధానం అమలు చేయాలి. ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి.

-సీహెచ్‌.రమాదేవి, పాతబీటు బజారు

  • నీటి సరఫరా విధానం
  • గృహాలు: 1.83లక్షలు
  • రోజు వారీ డిమాండ్‌ 168.86 ఎంఎల్‌డీలు
  • సరఫరా చేస్తున్నది 185.49 ఎంఎల్‌డీలు
  • గౄహ కనెక్షన్లు 1,92,357
  • వాణిజ్య కనెక్షన్లు 8513
  • సర్వీస్‌ రిజర్వాయర్లు 125
  • వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట, ధర్మసాగర్‌ తాగునీటి శుద్ధీకరణ కేంద్రాలు

భవిష్యత్తు అవసరాలపై దృష్టి

రెండు వారాలుగా రోజూ తాగునీరు సరఫరా విజయవంతంగా కొనసాగుతోంది. ఎండాకాలంలో తాగునీటికి ఢోకా లేదు. ధర్మసాగర్‌లో జలాశయంలో సమృద్ధిగా నీరు ఉంది. తాగునీటి సరఫరాకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తు అవసరాలకు డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. నీటి వృథాను అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాం. అక్రమ కనెక్షన్లు కట్టడి చేస్తాం.

-సత్యనారాయణ, గ్రేటర్‌ పర్యవేక్షక ఇంజినీర్‌(ఎస్‌ఈ)

వివరాలు ఇలా

ఇదీ చదవండి: గ్రేటర్​ వరంగల్​లో 66సీట్లు గెలవబోతున్నాం: సత్యవతి రాఠోడ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.