ETV Bharat / state

హన్మకొండలో రెచ్చిపోయిన దొంగలు - undefined

హన్మకొండ రామకృష్ణనగర్‌లోని దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చోరబడి 13 తులాల బంగారు ఆభరణాలు, లక్ష నగదు దోచుకెళ్లారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ
author img

By

Published : Apr 30, 2019, 4:47 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రామకృష్ణనగర్‌లో దోపిడి దొంగలు పంజా విసిరారు. తాళం వేసి ఉన్న ఇంటితోపాటు మరో రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. అందినకాడికి దోచుకెళ్లారు. రైల్వే ఉద్యోగి హనుమంతరావు కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి వచ్చే లోపు ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. బీరువాలో భద్రపరిచిన 13 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు, ఒక కెమెరా ఎత్తుకెళ్లారు.
హనుమంతరావు ఉండే వీధిలోని మరో రెండు ఇళ్లలో దొంగలు చేతివాటం చూపించారు. రెండు ఇళ్లలో ఒక ట్యాబ్ ఫోన్ మినహా విలువైన వస్తువులు చోరీకి గురి కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు.

ఇవీ చూడండి: సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద విద్యార్థుల అరెస్ట్​

Intro:TG_WGL_11_30_GOLD_AND_CASH_THEFT_IN_LOCKED_HOUSE_AB_C12
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు చోరీ చేసిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ లోని రామకృష్ణ నగర్ లో చోటుచేసుకుంది. రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న హనుమంత రావు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి సొంత పనుల పై నిన్న ఉదయం విజయవాడ వెళ్ళాడు. ఈరోజు ఉదయం వచ్చి చూడగా ఇంటి తలుపు తీసి ఉండడంతో పాటు ఇంట్లోని వస్తువులు అన్నీ చిందరవందరగా వేసి ఉండడం గమనించాడు. ఇంటి బీరువాలో భద్రపరిచిన 13 తులాల బంగారు ఆభరణాలు, ఒక లక్ష నగదు, ఒక కెమెరా చోరికి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. హనుమంతరావు ఇంటితోపాటు అదే వీధిలో మరో రెండు ఇళ్లలో దొంగలు చోరికి ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే మిగిలిన రెండు ఇళ్లలో ఒక ట్యాబ్ ఫోన్ మినహా విలువైన వస్తువులు ఏవి చోరీకి గురి కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఒకే వీధిలో మూడు ఇళ్లలో చోరికి ప్రయత్నాలు జరగడంతో సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
byte...

రాజు, బాధితురాలి సోదరుడు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.