వరంగల్ నగరంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. నగరంలోని పలు డివిజన్లలో ఒకేసారి రహదారిపై వెళ్తున్న వారిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.
జాన్‌పాక రామన్నపేటలో దాడి చేసిన ఘటనలో సుమారు 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పలుమార్లు నగరంలో వీధి కుక్కలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు వాపోయారు.
ఇదీ చూడండి : కోతుల కారణంగా.. పొలాల్లో ఉంటున్నారు!