మంగళవారం మధ్యాహ్నం వరంగల్ జిల్లాలో అన్ని జిల్లాల కలెక్టర్లు పర్యటించారు. అనంతరం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో భేటీ అయ్యారు. గత వారం సీఎం కేసీఆర్ పాలనాధికారులతో నిర్వహించిన సమావేశానికి కొనసాగింపుగానే హన్మకొండలోని హోటల్ హరితలో సోమేష్తో సమావేశమయ్యారు. కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులు, ముసాయిదా రూపకల్పనపై నూతన చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తున్న క్రమంలో కలెక్టర్ల పాత్ర కీలకమని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.
'భూప్రక్షాళనకు కలెక్టర్లు మరింత వేగంగా పనిచేయాలి'
కొత్త రెవెన్యూ చట్టంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలన్న అంశంపై కలెక్టర్ల సలహాలు, సూచనలను సోమేశ్ కుమార్ తీసుకున్నారు. త్వరలో దీనిపై నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తోందన్నారు. ప్రభుత్వం భూప్రక్షాళనకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న సోమేశ్ కుమార్.. పాలనాధికారులు మరింత వేగంతో కృషి చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి : ప్రభుత్వం ఇచ్చిన 25హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు