మట్టి వినాయకులతో పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని... కావున ప్రతి ఒకరు మట్టి వినాయకులనే పూజించాలని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఇంట్లోనే వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,967 కరోనా కేసులు, 8 మరణాలు