వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం అవడం వల్ల ఆలయానికి భక్తుల తాకిడి కొంత పెరిగింది.
అధికారులు ఎప్పటికప్పుడు ఆలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు. భక్తులు శానిటైజర్ వాడుతూ, భౌతిక దూరం పాటిస్తూ క్యూ లైన్లలో వెళ్లి మల్లన్నను దర్శించుకుంటున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద అధికారులు భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేశాకే లోనికి అనుమతిస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల