ETV Bharat / state

ఎంజీఎంలో సిబ్బంది నిర్లక్ష్యం.. తారుమారైన మృతదేహాలు - సిబ్బంది నిర్లక్ష్యంతో మృతదేహాలు తారుమారు

Negligence of Officials in Warangal MGM: వరంగల్ ఎంజీఎంలో ఒకరి మృతదేహం బదులు మరొకరి మృతదేహాన్ని పోస్టుమార్టం సిబ్బంది బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని కొద్ది దూరం తీసుకెళ్లాక.. ఈ డెడ్ బాడీ తమకు సంబంధించిన వారిది కాదని గుర్తించిన మృతుడి బంధువులు మళ్లీ ఎంజీఎంకు వచ్చి తమ వారి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Negligence of Officials in Warangal MGM
Negligence of Officials in Warangal MGM
author img

By

Published : Mar 26, 2023, 3:09 PM IST

Negligence of Officials in Warangal MGM: పోస్టుమార్టం అనంతరం.. కడసారి చూపు కోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు, బంధువులకు ఆసుపత్రి మార్చురీ సిబ్బంది ఓ మృతదేహాన్ని అప్పగించారు. దానిని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంతో ఇంటికి తీసుకెళ్లారు. మృతదేహన్ని ఇంట్లోకి తీసుకెళ్లాకా.. డెడ్​బాడీపై కప్పిన వస్త్రాన్ని తొలగించి చూసిన బంధువులు, కుటుంబీకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇది తమది కాదని తెలుసుకుని తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లి మార్చురీ సిబ్బందికి అప్పగించారు. మృతదేహాలు తారుమారైనట్లు తెలుసుకున్న అధికారులు వచ్చి చివరికి వాటిని సంబంధిత కుటుంబసభ్యులకు అప్పగించాల్సి వచ్చింది. పోస్టుమార్టం అధికారులు, మార్చురీ సిబ్బంది, పోలీసుల నిర్లక్ష్యంతో మృతదేహాలు తారుమారైన ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హనుమకొండ జిల్లా వంగర మండలానికి చెందిన ఆశాడపు పరమేశ్వర్ (53) ఈ నెల 22న రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎల్కతుర్తి క్రాస్​రోడ్డులో ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన పరమేశ్వర్​ను చికిత్స నిమిత్తం దగ్గరలోని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అతను చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మండలం తానేధార్​పల్లి గ్రామానికి చెందిన రాగుల రమేశ్ (40) ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు.

పోస్టుమార్టం తర్వాత తారుమారైన మృతదేహాలు: చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం మృతి చెందారు. వీరిద్దరి మృతదేహాలకు శనివారం వరంగల్ ఎంజీఎం అవరణలోని మార్చురీలో శవ పరీక్ష నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మార్చురీ సిబ్బంది, అధికారులు, పోలీసులు.. అక్కడే ఉన్న ఇరు కుటుంబాలకు మృతదేహాలను అప్పగించారు. రెండు కుటుంబాల వారు మృతదేహాలను తీసుకుని తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూసి అవి తమవారి మృతదేహాలు కాదని గుర్తించి ఒక్కసారి కంగుతిన్నారు.

అంబులెన్సుల్లో మృతదేహాలను వెనక్కి: వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులు, వైద్యాధికారులకు ఇవ్వగా.. వారు ఆయా గ్రామాల నుంచి అంబులెన్సుల్లో మృతదేహాలను వెనక్కి తెప్పించారు. తర్వాత వాటిని సంబంధీకులకు అప్పగించారు. అనంతరం ఎవరి కుటుంబసభ్యులు వారికి సంబంధించిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్​ను న్యూస్​టుడే వివరణ కోరగా.. విషయం వారి దృష్టికి రాగానే ఎవరి మృతదేహాలను వారికి అందజేశామన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.