ETV Bharat / state

Cyber criminals cheated young woman : జాబ్ ఆఫర్ అంటూ నిండా ముంచేశారు.. - హనుమకొండ జిల్లా వార్తలు

Cyber Fraud in hanamkonda : రాష్ట్రంలో సైబర్​ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజుకో కొత్త పద్ధతులతో ప్రజల డబ్బును దోచేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తాజాగా హనుమకొండ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Cyber criminals cheated young woman
Cyber criminals cheated young woman
author img

By

Published : Jul 26, 2023, 5:15 PM IST

Cyber Fraud : రాష్ట్రంలో సైబర్​ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజుకో కొత్త పద్ధతులతో ప్రజల డబ్బును దోచేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. కోట్లల్లో ప్రజల డబ్బులను దోచుకుంటున్న ఈ కేటుగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు.

Cyber criminals cheated young woman : తాజాగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయిన ఓ యువతి. ఆన్లైన్​లో జాబ్ కోసం వెతుకుతుండగా యువతి మొబైల్​కు ఒక నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో మీరు ఆన్లైన్ లో జాబ్ కోసం వెతుకుతున్నారని దానికోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసిందిగా సైబర్ నేరగాళ్లు ఆ యువతికి సూచించారు.

అది నిజమే అని నమ్మి ఆ యువతి తన పేటీఎం ద్వారా మొదట రూ.2000 పంపించింది. ఆ తర్వాత రూ.4000, రూ.8000, మొత్తంగా రూ.41,800 సైబర్ నేరగాళ్లకు చెల్లించింది. ఇంకా డబ్బులు అడగడంతో అనుమానం వచ్చి కాల్ చేయడంతో ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. చివరికి అంతా మోసం అని తెలిసి సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేయగా అది సైబర్ మోసంగా గుర్తించారు. యువతి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసిన ముల్కనూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

67కోట్ల మంది డేటా ఒక్కడే చోరీ చేశాడా..! అసలు నిందితులు ఎవరు?

తేలికగా తప్పించుకుంటున్న నేరస్థులు : రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్‌ నేరాల్లో నేరస్థులను పట్టుకోవడం పెను సవాల్‌గా మారింది. అత్యాధునిక సాంకేతికతతో పట్టువదలకుండా చేస్తున్న కృషితో మన రాష్ట్ర సైబర్‌ క్రైం పోలీసులు ఈ నేరస్థులను గుర్తిస్తున్నా వారిని పట్టుకుని రాష్ట్రానికి తీసుకురావడం, వారికి శిక్ష పడేలా చేయడం సవాల్‌గా మారింది. వారు వేరే రాష్ట్రాల నుండి కాల్ సెంటర్​లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నారని తెలుసుకుంటున్నప్పటికీ పట్టుకోవడం కష్టంగా మారుతోంది.

హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో సైబర్‌ నేరాలపై రోజు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. వీటిలో రాజస్థాన్, నోయిడా, దిల్లీ, యూపీ తదితర ప్రాంతాలకు చెందిన నిందితులు అధికశాతం ఉంటున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు అక్కడ సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని కొద్దిమంది పోలీసులు మాత్రమే మన పోలీసులకు సహకారం అందిస్తున్నారు.

ఎలాగోలా కష్టపడి వారిని పట్టుకుని రాష్ట్రానికి తీసుకొస్తున్నా రోజుల వ్యవధిలోనే జైలు నుంచి బయటపడుతున్నారు. సైబర్‌ నేరస్థులు అరెస్ట్​య్యారని తెలియగానే వారిని ఎలా బయటకు తీసుకురావాలనేది న్యాయవాదులు చూసుకుంటారు.లాయర్ల కోసం ఎంత డబ్బు ఖర్చయినా భరించేందుకు నిందితుల కుటుంబాలు సిద్ధంగా ఉంటాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఇవీ చదవండి.

ప్రకటనలు నమ్మి.. పెట్టుబడులు పెట్టారు... చివరికి...

Cyber Crime Gangs Arrest : హలో.. అంటూ అందినకాడికి దోచేస్తున్న ముఠాలు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.