ETV Bharat / state

ఎనుమాముల మార్కెట్లో మొదలైన పత్తి కొనుగోళ్లు - Warangal Urban District Latest News

వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌కు కొత్త పత్తి రావడం మొదలైంది. దసరా, దీపావళి వరకు తెల్లబంగారం విపణికి పోటెత్తుతుంది. ఈ క్రమంలో కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది. ఈ సారి నియంత్రిత సాగును ప్రోత్సహించి, వరి, పత్తి విస్తీర్ణం గణనీయంగా పెరిగేలా సర్కారు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెల్లబంగారం సాగు విస్తీర్ణం దాదాపు 28 శాతం పెరిగింది.

Warangal
ఎనుమాముల మార్కెట్లో మొదలైన పత్తి కొనుగోళ్లు
author img

By

Published : Sep 25, 2020, 1:51 PM IST

ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రైతన్నలు సాగు చేసినందున కొనుగోలు బాధ్యతా తీసుకోవాలి. లేదంటే కర్షకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. సీసీఐ కొనాలంటే అనేక నిబంధనలు ఉంటాయి. తేమ శాతం పరిగణించి, నాణ్యత సరిపోలితేనే ముందుకు వస్తుంది. మార్కెట్‌కు వచ్చే పత్తంతా సీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అవకాశం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి పత్తి కొనుగోలుకు ప్రత్యేక కార్యాచరణతో రైతులకు మద్దతు, గిట్టుబాటు ధర వచ్చేలా కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టాలి. సీజన్‌ ఆరంభం నుంచే సరైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఇబ్బంది ఉండదు.

వివరాలిలా....

వర్షాలతో దెబ్బ

ఈసారి జూన్‌లోనే తొలకరి పలకరించింది. తర్వాత వరుసగా వానలు కురిశాయి. ఆగస్టులో భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాను అతలాకుతలం చేశాయి. 50 నుంచి 100 శాతానికిపైగా అధిక వర్షపాతం నమోదైంది. వానల వల్ల వేల ఎకరాల్లో తెల్ల బంగారం దెబ్బతిన్నది. పొగాకు లద్దెపురుగు, గులాబీ రంగు పురుగు ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. వానలు వరుసగా కురుస్తూనే ఉండడంతో నాణ్యతపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే రైతులు నష్టపోయారు. త్వరలో పంట చేతికొచ్చాక మార్కెట్‌కు తీసుకొస్తే అక్కడ నాణ్యత పేరుతో దళారులు తక్కువ ధర చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో త్వరగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రైవేటు వ్యాపారులు రైతులను మోసం చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది. గత రబీలో వరి, మక్కలను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో అన్నదాతలకు కష్టం తప్పింది. ఇదే విధంగా పత్తి విషయంలోనూ భరోసా ఇవ్వాలి.

ప్రభుత్వం దృష్టి సారించాలి

గత సీజన్‌లో మక్కలు, వరిని ప్రభుత్వం ప్రతి రైతు నుంచి కొనుగోలు చేసింది. ఈ సారి నియంత్రిత సాగు నేపథ్యంలో పత్తి విస్తీర్ణం రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పెరిగింది. మార్కెట్‌లో రైతులకు మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం దృష్టి సారించాలి.-జలపతిరావు, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త

వివరాలిలా...

మిల్లులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్టోబర్‌ 1 నుంచే సీసీఐ పత్తి కొనుగోలు చేసేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. రానున్న పత్తి సీజన్‌కు మార్కెట్‌ కమిటీ తరఫున అన్ని విధాలుగా సన్నద్ధమయ్యాం. జిన్నింగ్‌ మిల్లులు మరమ్మతుల్లో ఉన్నాయి. అక్టోబర్‌ 10 వరకు అవి అందుబాటులోకి వస్తాయి. ఈనెల 28న వరంగల్‌ మార్కెట్లో జిన్నింగ్‌ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశాం.-వెంకటేశ్‌ రాహుల్‌, కార్యదర్శి, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌

  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ సారి పత్తి సాగు (ఎకరాల్లో)
  • వరంగల్‌ అర్బన్‌ 82819
  • వరంగల్‌ రూరల్‌ 203834
  • మహబూబాబాద్‌ 134988
  • ములుగు 30490
  • భూపాలపల్లి 122925జనగామ 183270

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.