సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న ఒప్పంద కార్మికులు ఆందోళన చేపట్టారు.
సమానపనికి సమానవేతనం చెల్లించాలని కోరుతూ.. ఆసుపత్రి ఎదుట విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. కరోన సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలు తెగించి విధులు నిర్వహించామని పేర్కొన్నారు. తమకు వేతనాలు పెంచేంతవరకు విధులు నిర్వహించమని తేల్చిచెప్పారు.
![contract workers protest , warangal urban district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-02-30-contract-workers-andholana-av-ts10077_30032021132742_3003f_1617091062_1092.jpg)
ఇవీ చదవండి: మహిళ గర్భాశయంలో సూది వదిలేసిన వైద్యులు!