ETV Bharat / state

మేయర్​ గుండా ప్రకాశ్​ను అడ్డుకున్న కాంగ్రెస్​ శ్రేణులు - warnagal district latest news

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వరంగల్​ అర్భన్​ జిల్లా కేంద్రంలో నీటమునిగిన కాలనీలను మేయర్​ గుండా ప్రకాశ్​రావు పరిశీలించారు. తిరిగి వెళ్లేటప్పుడు కాంగ్రెస్​ నాయకులు ఆయన్ను అడ్డుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్​ చేశారు.

congress leaders blocked mayor at warangal district
మేయర్​ గుండా ప్రకాశ్​ను అడ్డుకున్న కాంగ్రెస్​ శ్రేణులు
author img

By

Published : Oct 14, 2020, 5:01 PM IST

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని సమ్మయ్య నగర్​, వందఫీట్ రోడ్​ కాలనీలో వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. ఈ ప్రవాహాన్ని పరిశీలించేందుకు జిల్లా మేయర్​ గుండాప్రకాశ్​రావు, స్థానిక కార్పొరేటర్ స్వరూప రాణి వచ్చారు. వారు తిరిగి వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్​ శ్రేణులు అడ్డుకున్నారు.

ప్రతిసారి వర్షం పడినప్పుడు ఆయా కాలనీలు నీట మునిగిపోతాయంటూ.. వాటికి శాశ్వత పరిష్కారం చూపించాలంటూ మేయర్​ కారు ను అడ్డుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి రూ. కోట్ల బడ్జెట్​ వస్తుంటే అధికారులు, స్థానిక నేతలు ఏమి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి నాలాలను వెడల్పు చేసి కాలనీలు జలమయం కాకుండా చూడాలని కోరారు.

ఇదీ చదవండిః ఓరుగల్లులో జోరువాన... రోడ్లన్నీ జలమయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.