ETV Bharat / state

'సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి' - తెలంగాణ వార్తలు

సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

Collector Rajiv Gandhi inspects the construction of the new Collectorate building

author img

By

Published : Jun 10, 2021, 10:43 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ చివరి పనులు త్వరితగతిన పూర్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. హన్మకొండలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంజినీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) గణపతి రెడ్డి, సీఎమ్​ఓ అడ్వైజర్ సుధాకర్ తేజలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

మిగిలిన ఫర్నిచర్, పార్టిషన్ చివరి పనులను త్వరితగతిన పూర్తి చేసి కార్యాలయాలను తరలించేందుకు సన్నద్దం చేయాలన్నారు. త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ నిర్మాణ పురోగతిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : KCR: కొత్త మండలాలకు సీఎం పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.