ETV Bharat / state

'ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు' - నర్సంపేట బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

CM KCR Speech at Narsampet Praja Ashirvada Sabha : రైతుబంధు ద్వారా ప్రజల డబ్బు వృథా చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసమే ధరణి పోర్టల్‌ తెచ్చామన్నారు. ధరణి పోర్టల్‌ వల్లే రైతులకు అన్ని డబ్బులు సకాలంలో చేరుతున్నాయని చెప్పారు. ధరణి లేకుంటే రైతులకు రైతుబంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ గెలిస్తే.. 3 గంటల కరెంట్‌ మాత్రమే ఇస్తారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎనాడూ రైతుల గురించి ఆలోచించలేదని విరుచుకుపడ్డారు.

CM KCR Speech at Narsampet Praja Ashirvada Sabha
CM KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2023, 7:39 PM IST

'ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు'

CM KCR Speech at Narsampet Praja Ashirvada Sabha : అభ్యర్థుల గుణగణాలతో పాటు పార్టీల చరిత్ర కూడా చూడాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ప్రజలే గెలవాలని సూచించారు. నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ప్రతి పక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా, గోదావరి నదులు రాష్ట్రంలో పారుతున్నా.. నీళ్ల కరువు ఉండేదన్నారు. గతంలో కరెంట్‌ పరిస్థితి ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందని ప్రజలను అడిగారు.

Narsampet BRS Praja Ashirvada Sabha : ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ప్రజాస్వామ్యానికి అర్థం లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు ఇవ్వకుంటే గత ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పానన్నారు. మోదీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్‌ లేదని విమర్శించారు. తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు నీటి తీరువా పన్నులు రద్దు చేశామని చెప్పారు. 7500 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని వివరించారు.

CM KCR Comments on Telangana Leaders : రైతుబంధు ద్వారా ప్రజల డబ్బు వృథా చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు(Telangana Congress Leaders) అంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసమే ధరణి పోర్టల్‌ తెచ్చామన్నారు. ధరణి పోర్టల్ తెచ్చాక వీఆర్‌వో, ఎమ్మార్వోల బాధలు తొలగాయని తెలిపారు. ధరణి పోర్టల్‌ వల్లే రైతులకు అన్ని డబ్బులు సకాలంలో చేరుతున్నాయన్నారు. ధరణి లేకుంటే రైతులకు రైతుబంధు(Rythu Bandhu) ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ గెలిస్తే.. 3 గంటల కరెంట్‌ మాత్రమే ఇస్తారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎనాడూ రైతుల గురించి ఆలోచించలేదని ఎద్దేవా చేశారు.

విచక్షణతో ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలుస్తారు: కేసీఆర్‌

'ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ప్రజలే గెలవాలి. అభ్యర్థుల గుణగణాలతో పాటు పార్టీల చరిత్ర కూడా చూడాలి. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. కృష్ణా, గోదావరి నదులు రాష్ట్రంలో పారుతున్నా.. మనకు నీళ్ల కరువు ఉండేది. గతంలో కరెంట్‌ పరిస్థితి ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉంది. ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు ఇవ్వకుంటే గత ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పాను. మోదీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్‌ లేదు. తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం.' -కేసీఆర్‌, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి

BRS Election Campaign 2023 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు తాగునీరు, సాగునీరు ఇవ్వలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయంలో 18వ స్థానంలో ఉండేదన్నారు. ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని పేర్కొన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. సమైక్యవాదులకు వ్యతిరేకంగా నర్సంపేట ప్రజలు నిరసన తెలిపారని చెప్పారు. సమైక్యవాది షర్మిల పెద్ది సుదర్శన్‌రెడ్డిపై పగబట్టారంటా అని ప్రశ్నించారు. సుదర్శన్‌ రెడ్డిని ఓడించేందుకు షర్మిల డబ్బుల కట్టలు పంపుతున్నారని ఆరోపించారు. సుదర్శన్‌రెడ్డిని గెలిపించి షర్మిలకు బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.

సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది: కేసీఆర్‌

నేటి నుంచి సీఎం కేసీఆర్ మూడో విడత ఎన్నికల ప్రచారం - ఇవాళ దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట సభలకు హాజరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.