ETV Bharat / state

'గ్రీన్​ ఫ్రైడే'లో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

author img

By

Published : Jun 19, 2020, 7:14 PM IST

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ చేపట్టిన గ్రీన్​ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్​ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ మొక్కలు నాటారు. హరితహారం ద్వారా ప్రజలందరూ మొక్కలు నాటి... వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఎమ్మెల్యే తెలిపారు.

chief whip vinay bhaskar partcipated in green Friday challange
'గ్రీన్​ ఫ్రైడే'లో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

మంత్రి కేటీఆర్​ చేపట్టిన గ్రీన్​ ఫ్రైడే కార్యక్రమానికి వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో ఉద్యమంలా ప్రారంభమైంది. గ్రీన్​ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్​ విప్​, ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్​ చేపట్టిన హరితహారానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

మంత్రి కేటీఆర్​ వరంగల్​ నగరాన్ని హరితవనంగా మార్చేందుకు ప్రణాళికలు చేశారని వినయ్​ భాస్కర్​ అన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా చర్యలు తీసుకుంటే.. రానున్న తరాలకు మంచి వాతావరణం అందించిన వారిమవుతామని ఆయన అన్నారు.

ఇదీచూడండి: సీనియర్​ ఐఏఎస్​ అధికారి బీపీ విఠల్ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.