వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌కు భాజపా ఫిర్యాదు చేసింది. 27వ తేదీ సాయంత్రం తర్వాత రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, ర్యాలీలు, ద్విచక్ర వాహన ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశించిందని.. అందుకు విరుద్ధంగా శివనగర్ ఆర్య వైశ్య భవన్‌లో ఎమ్మెల్యే నరేందర్ సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ సమావేశాన్ని కవర్ చేసిన మీడియా ప్రతినిధిపై దాడి చేసి, కెమెరాను పగులగొట్టారని భాజపా ఆరోపించింది. అందుకు సంబంధించిన వీడియోలను ఫిర్యాదుతో పాటు జత చేస్తున్నామని.. తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని భాజపా విజ్ఞప్తి చేసింది.