వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి మండల దీక్ష పూర్తి చేసుకున్న మాలధారులు.. కాశీబుగ్గలోని హరిహర పుత్రుని ఆలయంలో ఇరుముడిని ధరించారు. ఆలయ గురు స్వామి శ్రీకాంత్ చార్యులు ముందుగా స్వామి వారికి పంచామృతాలతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు ఇరుముడి కట్టారు.
అయ్యప్ప స్వాములు సమూహంగా ఏర్పడి శబరిమలకు పాదయాత్రగా వెళ్లారు. హరిహర పుత్రుని స్మరిస్తూ యాత్ర చేపట్టారు. నలభై ఒక్క రోజుల పాటు నియమనిష్ఠలతో దీక్షను పూర్తిచేసి.. తమ మొక్కులను ఇరుముడిగా గట్టి మణికంఠునికి సమర్పిస్తారు.
ఇదీ చదవండి: కన్నుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం