ఉద్యోగులు కూడా వ్యవసాయ సాగుకు సిద్ధపడేలా.. రాష్ట్రంలో సమగ్ర సాగు విధానం రాబోతోందని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వానాకాలం నియంత్రణ పంట సాగు విధానంపై జరిగిన అవగాహన సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముఖ్యంగా వరంగల్ పట్టణ జిల్లా పరిధిలోని రైతులు కూరగాయలు, పండ్లు, పూల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఈ దిశగా అధికారులు, నాయకులు రైతులను చైతన్య పర్చాలని కోరారు.
భూమి ఉన్న ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. రైతులు అధికస్థాయిలో పంటలు పండించి.. రాజులు కావాలని ఆకాక్షించారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని మంత్రి సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాకు అవసరమైన పంటలు వేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: రైతులను నిండాముంచిన అకాల వర్షం