ETV Bharat / state

24 గంటల పాటు యువతి స్పీచ్​.. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు కైవసం - Telangana latest news

young woman got a place in Telugu Book of Records: సూర్యపేటకు చెందిన ప్రియాంక అనే యువతి 24 గంటల పాటు నిరంతర ప్రసంగం చేసి తెలుగు బుక్‌ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. క్లీనికల్‌ రిసెర్చ్‌లో ఉద్యోగం చేస్తున్న ఈ యువతి హనుమకొండలోని సన్​రెజ్‌ టూ సన్‌రైజ్‌ అనే ప్రసంగాన్ని ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు నిరంతరంగా ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకుంది.

Telugu Book of Records
తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు
author img

By

Published : Dec 12, 2022, 4:56 PM IST

Updated : Dec 12, 2022, 6:12 PM IST

young woman got a place in Telugu Book of Records: హనుమకొండలో ఓ యువతి 24 గంటలపాటు నిరంతర ప్రసంగం చేసి తెలుగు బుక్ ఆఫ్‌ రికార్డుకు ఎక్కింది. సూర్యపేటకు చెందిన ప్రియాంక నగరంలోని వాగ్ధేవి కళాశాలలో బీఫార్మసీ చదివి క్లినికల్‌ రీసెర్చ్​లో ఫార్మసిస్ట్​గా ఉద్యోగం చేస్తుంది. అయితే తెలుగు బుక్ ఆఫ్​ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్​... ఇలా వరల్డ్‌ రికార్డు కోసం ప్రియాంక హనుమకొండలో 24 గంటల నిరంతర స్పీచ్ సన్‌ రైజ్ టు సన్ రైజ్ ప్రారంభించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించిన ప్రియాంక సోమవారం ఉదయం 9 గంటల వరకు నిరంతరంగా ప్రసగించింది.

క్లినికల్‌ రీసెర్చ్, డాటా మేనేజ్​మెంట్​పై 24 గంటలు నిర్విరామంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్ అండ్ చీఫ్ అడ్వైజర్ టీవీ ఆశోక్ పాల్గొని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 24 గంటల పాటు నిరంతర ప్రసంగం చేయడం పట్ల తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదుకు ఎక్కిందని నిర్వహకులు తెలిపారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు అయినందుకు ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా గిన్నీస్ బుక్​లో పేరు సంపాదించడమే లక్ష్యంగా కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

24 గంటల పాటు యువతి స్పీచ్​.. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు కైవసం

ఇవీ చదవండి:

Last Updated : Dec 12, 2022, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.