ETV Bharat / state

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 608 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ!

608 Nominations Rejected in Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లలో 608 తిరస్కరణకు గురయ్యాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4,798 మంది నామపత్రాలు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్​ పోటీలో నిలిచిన గజ్వేల్‌లో 114 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది. తిరస్కరించిన నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Telangana Assembly Election
608 Nominations Rejected in Telangana Assembly Election
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2023, 7:03 AM IST

608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

608 Nominations Rejected in Telangana Assembly Election : శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల(Telangana Election N0minations) పరిశీలన ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు రావడం, కొందరి అభ్యర్థుల నామినేషన్లపై ప్రత్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. వాటిపై నిర్ణయం వెలువరించటానికి అధికారులకు ఎక్కువ సమయం పట్టింది. పరిశీలన ప్రక్రియ సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,798 మంది నామినేషన్లు వేశారు. వాటిలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​ భార్య జమున, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు, నాగార్జునసాగర్​లో మాజీ మంత్రి జానారెడ్డి, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్​ వేసిన నామినేషన్లను ఎన్నికల సంఘం(Election Commission) తిరస్కరించింది. ఆ వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. శాసనసభ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేయకూడదు. నాలుగు సెట్లకు మించి నామినేషన్లు దాఖలు చేయరాదు. కానీ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రెండు కన్నా ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు వేశారు.

Telangana Assembly Election 2023 : సపవత్‌ సుమన్‌ అనే అభ్యర్థి స్వంతంత్ర అభ్యర్థిగా 4 నియోజకవర్గాల్లో ఆరు సెట్ల నామినేషన్లు వేశారు. మహ్మద్​ అబ్దుల్​ అజీమ్​, మహ్మద్​ అక్రం అలీ ఖాన్​ మూడేసి చోట్ల నామినేషన్లు వేయగా.. ఈ తరహా నామినేషన్ల విషయంలో అన్ని రకాల నిబంధనలు పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సి వచ్చింది. సదరు అభ్యర్థులు మొదట దాఖలు చేసిన నామినేషన్లను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మొదటి రెండు నియోజకవర్గాల్లోని నామినేషన్లను నామినేషన్​ వేసిన తేదీ, సమయాన్ని పరిశీలించి ఆమోదించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించడంలో వారే కీలకం

పువ్వాడ అజయ్​ నామినేషన్​ ఓకే : అలాగే ఖమ్మం బీఆర్​ఎస్​ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ సమర్పించిన అఫిడవిట్​ నిబంధనల మేరకు లేవంటూ.. వారం రోజుల క్రితం కాంగ్రెస్​ లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దేవరకద్రలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మధుసూదన్‌రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉందంటూ బీఆర్​ఎస్​ అభ్యంతరం తెలిపింది. అయితే రెండో ఓటు రద్దు చేయాలంటూ ఆయన ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయడంతో.. నామినేషన్​ను అధికారులు ఆమోద ముద్ర వేశారు.

Telangana Election Polls Candidates Nominations : పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినికి మూడు వేర్వేరు చిరునామాలు ఉన్నాయంటూ బీఆర్​ఎస్​ ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు అలా చిరునామాలు ఉండవచ్చని ఎన్నికల సంఘం వచ్చిన అభ్యంతరాలను రిజెక్టు చేసింది. అలంపూర్‌ బీఆర్​ఎస్​ అభ్యర్థి విజయుడు ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్‌ వేశారన్న అభ్యంతరాలనూ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీకి చెందిన 8 మంది అభ్యర్థుల నామినేషన్లను కొన్ని కారణాలతో ఎన్నికల సంఘం తిరస్కరించింది.

రణరంగాన్ని తలపిస్తున్న రాజకీయం - ఖమ్మం గుమ్మంలో ఈసారి గెలుపెవరిదో?

ఊపందుకున్న ఎన్నికల ప్రచారాలు, ఓటర్ల అనుగ్రహం కోసం ముమ్మర ప్రయత్నాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.