ETV Bharat / state

ఈటీవీ భారత్ రిపోర్ట్: బావి ఘటనలో దర్యాప్తు ఎలా సాగుతోంది..!

వరంగల్​ రూరల్​ గొర్రెకుంట బావిలో మృతదేహాల మిస్టరీపై దర్యాప్తు వేగవంతమైంది. ఎంజీఎం మార్చురీలోని మృతదేహాల నుంచి మరోసారి నమూనాలను సేకరించారు. దీనిపై మరింత సమాచారం ఈటీవీ భారత్​ ప్రతినిది రవించంద్ర అందిస్తున్న రిపోర్ట్.

warangal rural district gorrekunta well mysterious deaths latest news
బావి ఘటన: మృతదేహాల మరోసారి నమూనాల సేకరణ
author img

By

Published : May 24, 2020, 12:25 PM IST

ఈటీవీ భారత్ రిపోర్ట్: బావి ఘటనలో దర్యాప్తు ఎలా సాగుతోంది..!

వరంగల్ గొర్రెకుంట బావిలో మృతదేహాల మిస్టరీ ఛేదించేందుకు పది పోలీసు బృందాలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపడుతున్నారు. ఎంజీఎం మార్చురీలో క్లూస్‌టీం, ఫోరెన్సిక్‌ నిపుణులు వేలిముద్రలు సహా కొన్ని నమూనాలు సేకరించారు. ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలతో సరిపోల్చుతున్నారు. కేసు నిగ్గుతేల్చేందుకు అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు.

బతికుండగానే బావిలోకి నెట్టి చంపారా లేదా విషప్రయోగం వల్ల చనిపోయారా అనే అంశాలపైనా విచారణ బృందం ఆరా తీస్తోంది. పోలీసుల అనుమతించాకే బంధువులకు మృతదేహాలు అప్పగించనున్నట్లు వైద్యులు వెల్లడించారు. బిహారీ యువకుల బంధువులెవరూ రాకపోతే వరంగల్‌లోనే అంత్యక్రియల నిర్వహించే అవకాశం ఉంది.

సంబంధిత కథనం: గొర్రెకుంట బావిలో మృతదేహాలపై వీడుతున్న మిస్టరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.