భూ సమస్యలు ఉంటే వీఆర్వో, ఉపాధి హామీ పనులు ఉంటే ఫిల్డ్ అసిస్టెంట్‌ని కలవాలనే రోజులు పోయాయని వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత అన్నారు. జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న కలెక్టర్‌కు ప్రతీ గ్రామంలో కనీసం ఒక్కరైనా భూ సమస్యలు ఉన్నాయంటూ మొర పెట్టు కోవడంతో రెవెన్యూ సిబ్బందిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
సర్పంచ్ స్థాయి ప్రజా ప్రతినిధులకు ఐదు రోజుల శిక్షణ ఇచ్చామని అయినప్పటికీ... వారికి ఏ సమస్యలపై ఎవరిని కలవాలో నిర్ణయించుకోలేక పోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు విషయ పరిజ్ఞానాన్ని మరింత పెంచుకొని ప్రజా సమస్యలు తీర్చే దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్ హరిత సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న జిల్లాలుగా తెలంగాణను విభజించిన కారణాన్ని ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు తెలుసుకొని ప్రజలు సమస్యలు వెంటనే తీరే విధంగా చూడాలని సూచించారు.
ఇవీ చూడండి: వంటకు విదేశీ నూనెల మంట.. ఇంకెన్నాళ్లీ తంటా?