వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెం, కట్ర్యాల గ్రామాల్లో కలెక్టర్ హరిత ఆకస్మికంగా పర్యటించారు. హరితహారం మొక్కల పెంపక కేంద్రాలు పరిశీలించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గ్రామాల్లో చెత్త సేకరణ పరిశుభ్రతపై ఆరాతీశారు.
పారిశుద్ధ్య పనుల గురించి సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. రానున్న వర్షాకాలంలో పచ్చదనం పెంపొందిస్తూనే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందుకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. హరిత హారంలో నాటిన ప్రతి మొక్కకు తమ ఇంట్లోని వారి పేర్లను పెట్టి నిరంతర పర్యవేక్షణ చేయాలని ప్రజలకు సూచించారు. ఏ ఒక్క మొక్క ఎండిపోయినా... సంరక్షణ చర్యలు చేపట్టక పోయిన చర్యలుంటాయని కలెక్టర్ హరిత అధికారులను హెచ్చరించారు.