ఎలాంటి పంటలు సాగుచేయాలన్నా ప్రతీ రైతుకు ఎదురయ్యే ప్రధాన సమస్య కలుపు. పూత నుంచి కోత దశ వరకు కలుపు వల్ల వచ్చే ఖర్చు రైతులకు పెనుభారంగా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ గ్రామీణ జిల్లా రైతులు కొత్త పంథాలో వ్యవసాయం ప్రారంభించారు. కలుపు సమస్యను నివారించేందుకు మల్చింగ్ విధనాన్ని అవలంభిస్తున్నారు. సకాలంలో కూలీలు దొరకక... దొరికినా ఎక్కువ మొత్తంలో కూలీ డబ్బులు వెచ్చించడంలో విసిగి వేసారిపోయిన రైతన్నలు... ఇలా మల్చింగ్ సేద్యంతో ఖర్చులను తగ్గించుకుంటూ మేలైన వ్యవసాయం చేస్తున్నారు.
వరంగల్‌కు చెందిన బుచ్చిరెడ్డి అనే రైతు... తనకున్న 2 ఎకరాల్లో మిరప సాగు చేపట్టారు. ఉద్యానవన అధికారుల సలహాలు, సూచనల మేరకు మల్చింగ్ విధానంలో సాగుకు సిద్ధమై పంట వేశారు. మల్చింగ్‌తో కలుపు సమస్య తలెత్తదన్న అధికారుల సూచనలతో సాగు ప్రారంభించారు.
అనుకున్న దానికంటే ఎక్కవగా మిరప సాగులో ఆయన రాణించారు. కలుపు రహిత సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు. దాదాపు 35 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న ఆయన... ఇంత వరకు ఇలాటి సాగు చేయలేదని అధికారుల సలహా వల్లే... మల్చింగ్ సాగు చేపట్టానని అంటున్నారు. ఈ పద్ధతి ద్వారా ఖర్చు తగ్గి... మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు. సాగుకు ఖర్చయ్యే మొత్తంలో 20 శాతం డబ్బులు మల్చింగ్ సాగుకు ఖర్చు చేస్తే... ఆ తర్వాత పంట లాభలు రైతు సొంతమని చెబుతున్నారు.
ఇదీ చూడండి: పంటను రక్షించుకోవడం కోసం కాడెడ్లైన దంపతులు