వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. పనుల ఆలస్యం పట్ల అధికారులపై మండిపడ్డారు. ఈ దసరాలోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో గార్డెనింగ్ తదితర అంశాలపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో డీసీపీ నాగరాజు, సీఐ మహేందర్, ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'ప్రాజెక్టులు మేము కడితే.. కేసీఆర్ పసుపు, కుంకుమ చల్లుతున్నారు'