వరంగల్ గ్రామీణ జిల్లాలో మరో పదిరోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(minister errabelli) అన్నారు. దీనికోసం ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి సందర్శించారు. కొవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులనడిగి తెలుసుకున్నారు. అనంతరం కరోనా చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు.
కొవిడ్ టీకాల(Covid Vaccination) కేటాయింపులో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. రాష్ట్రంలో తయారైన వ్యాక్సిన్లను ముందుగా ఇక్కడివరకే వినియోగించాలని డిమాండ్ చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా నియంత్రణలో ఉందని తెలిపారు.