వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు 2012 నాటి కేసులో ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పరకాల పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదైంది. వారితోపాటు ఏ3, ఏ4లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కోర్టు సమన్లు జారీ చేసింది. వీరందరూ ఈనెల 10న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావల్సి ఉంది. మరోపక్క ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే రోజు హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావల్సి ఉంది.
ఇదీ చదవండిః 2020లో టీ హబ్ రెండో దశ ప్రారంభం: కేటీఆర్