వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన కూరగాయలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు నష్టపోతున్నారు. టమాట, సొరకాయలు తదితర కూరగాయలు సాగు చేసిన రైతులకు కనీసం కూలీ, రవాణా ఖర్చులు సైతం దక్కని పరిస్థితి. దీంతో రైతులు వాటిని చేలల్లోనే వదిలేస్తున్నారు.
వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం కోనాయమాకుల గ్రామానికి చెందిన రైతు పోలీసు శంకర్‌రావు ఇటీవల ఎకరం విస్తీర్ణంలో సొరకాయలను సాగు చేశారు. ధర పడిపోవడం వల్ల పంటను వదిలేశారు. ఫలితంగా.. ఆ సొరకాయలు ఇలా మేకలు, గొర్రెలకు ఆహారం అవుతున్నాయి.