Road Accident in Hanamkonda : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల శివారులో జెర్రీ పోతుల వాగు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ములుగు నుంచి హనుమకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును(TSRTC Bus) ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో, ఆయిల్ ట్యాంకర్ పక్కనే ఉన్న చిన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు.
Diesel Tanker Collided RTC Bus : బస్సులో ప్రయాణిస్తున్న పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి(MGM Hospital) బాధితులను తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 90 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ కండక్టర్ సునీత తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
బైకును ఢీకొన్న టిప్పర్ లారీ - మంటలు చెలరేగి తండ్రీకుమారులు సజీవదహనం
ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ తప్పిదం వల్లే, ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. ఆత్మకూరు సీఐ రవిరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు యాక్సిడెంట్ కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో మేడారం వెళ్లే భక్తులు గంటన్నరపాటు ఇబ్బందులు పడ్డారు.
నీరుకుళ్ల జాతీయ రహదారి క్రాస్ వద్ద డీజిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ మాత్రం నెమ్మదిగానే వాహనం నడుపుతున్నప్పటికీ, ట్యాంకర్ ఎదురుగా స్పీడుగా వచ్చి గుద్దింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. అదేవిధంగా బస్సు ముందరి భాగం బాగా దెబ్బతింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 90 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.-సునీత, ఆర్టీసీ కండక్టర్
రహదారులపై సంభవించే చాలా వరకు ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యపు డ్రైవింగ్గా(Careless Driving) తెలుస్తోంది. వాహనదారులు ఎంత సక్రమంగా వారి వెహికల్ నడిపినా ఎదుటివారు చేసే తప్పిదానికి బలిపశువులు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అటువంటి భీతావహ పరిస్థితులు ప్రయాణికుల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.