చెరువు శిఖం భూమిలో అక్రమకట్టడాలపై రెవెన్యూశాఖ ఇచ్చిన నోటీసులను ఆక్రమణదారులు బేఖాతరు చేస్తున్నారు. గీసుకొండ మండలం గొర్రెకుంట సమీపంలోని మల్లికుంట చెరువు శిఖం భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లపై ఈటీవీ, ఈనాడులో కథనాలు రాగా.. స్పందించిన అధికారులు సర్వే చేపట్టారు. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. గడువు తీరినా కబ్జాదారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
9 మంది ఆక్రమణదారులు మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. వీరంతా ఓ ప్రజా ప్రతినిధి అండచూసుకుని.. రాత్రికి రాత్రి ఇళ్లు నిర్మించుకుని... ఇంటినంబర్లు, మీటర్లు, నల్లా కనెక్షన్లు తెచ్చుకొన్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయాలని పథకం వేశారు.
ఇదీ చూడండి: మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజపై కేసు నమోదు