వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించలేదని ప్రజలు ఆందోళనకు దిగారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కాకుండా తమకు అనుకూలమైన వారికి ఇళ్లు కేటాయిస్తున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
తెరాస అనుకూల వ్యక్తులకు ఇళ్లు కేటాయించి నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తయిన 50 ఇళ్లలో గతంలో 200లకు పైగా దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 11 మందికి మాత్రమే ఇళ్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం : కేసీఆర్