100కు కాల్ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదేమో: పరకాల ఏసీపీ వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో పరకాల ఏసీపీ శ్రీనివాస్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సంచలనంగా మారిన పశువైద్యురాలి కేసులో ఆమె చెల్లెలితో 3 నిమిషాలు ఫోన్ మాట్లాడే బదులు 100కు కాల్ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
మహిళలు హకీయే అప్లికేషన్ను తప్పకుండా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని ఏసీపీ సూచించారు. ఇకనుంచి ప్రతి కళాశాల, ఉన్నత పాఠశాలల్లో వారంలో రెండు రోజులు అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం పరకాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి: షాద్నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు