వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పర్యటించారు. చింతనెక్కొండ గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న విలేజ్ పార్క్, శ్మశానవాటిక, గ్రామపంచాయతీ అదనపు గదులను ప్రారంభించారు. అనంతరం పర్వతగిరి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు.. ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.7 లక్షల 30 వేలు విలువగల చెక్కులను అందజేశారు.
కష్ట కాలంలోనూ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ఢోకా లేకుండా తెరాస పనిచేస్తోందని ఎమ్మెల్యే రమేశ్ అన్నారు. ప్రతి పల్లెను అన్నిరకాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృత నిశ్చయంతో పని చేస్తున్నారని కొనియాడారు. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించి కరోనాను తరిమికొట్టాలని సూచించారు.