చరిత్రలో నిలిచిపోయేవిధంగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూచించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా చిరకాలం గుర్తిండిపోయేలా కొత్త పనులు చేపట్టాలన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్పై వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో జరిగిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. జిల్లాలోని పర్వతగిరి మండలం అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. రూర్బన్ పథకం నిధులే కాకుండా మరికొన్నింటితోనూ వివిధ పనులు చేపట్టి... రాష్ట్రంలోనే పర్వతగిరి ఆదర్శ మండలంగా తయారవ్వాలని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ఎంతమాత్రం రాజీపడవద్దని... 30 రోజుల గ్రామ ప్రణాళిక అమలు పథకం నిరంతరం సాగుతుందని మంత్రి చెప్పారు. ఎక్కడ ఎవరు చెత్త వేసినా... జరిమానా విధించాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ హరిత, ఎంపీ పసునూరి దయాకర్, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:వేడెక్కిన హుజూర్నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం