వరంగల్ గ్రామీణ జిల్లా గవిచర్లలో జరిగిన ఘటన దురదృష్టకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కలెక్టర్, సీపీతో మాట్లాడిన మంత్రి.. క్షతగాత్రులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
రోడ్డు పక్కన ఉన్న ఓపెన్ బావుల పట్ల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఉపయోగంలో లేని బావులు, బొందలు ఉంటే వెంటనే మూసివేసి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: అదుపుతప్పి బావిలో పడిన జీపు.. వాహనంలో 15 మంది