వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ డిపో ముందు కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై బంగారం లేదని, కేవలం తమ సమస్యలు ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఎంచుకున్నామని కార్మిక నాయకులు అన్నారు.
కార్మికులుగా పని చేసుకుని బతకడం తప్ప, మాకు విధ్వంసాలు చేయడం తెలియదని పేర్కొన్నారు. అలాంటి కార్మికులను పట్టుకుని పోలీసు శాఖ అవమానించి తమ గర్వాన్ని చాటుకున్నారని కార్మిక నాయకులు ఆరోపించారు.
ఇదీ చూడండి : అన్నదాత ఆత్మహత్యల్లో తెలంగాణకు ఆరో స్థానం