ETV Bharat / state

KTR Warangal Tour Today : నేడు ఓరుగల్లులో మంత్రి కేటీఆర్ పర్యటన.. వారంలో ఇది రెండోసారి - తెలంగాణ తాజా వార్తలు

KTR Warangal Tour Today : ఐటీ పురపాలక శాఖ మంత్రి మరోసారి వరంగల్ జిల్లాకు వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో కేటీఆర్‌ భూపాలపల్లికి చేరుకొని.. నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌, పోలీస్‌ కార్యాలయం, డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంత్రి ప్రారంభించనున్నారు. పరకాల, తొర్రూరు, కొడగండ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు.. మంత్రి శ్రీకారం చుట్టనున్నారు.

KTR Election Campaign Warangal
KTR Warangal Tour Today
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 8:29 AM IST

KTR Warangal Tour Today నేడు ఓరుగల్లులో మంత్రి కేటీఆర్ పర్యటన.. వారంలో ఇది రెండోసారి

KTR Warangal Tour Today : ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది. భూపాలపల్లిలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌, పోలీస్‌ కార్యాలయం, డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంత్రి ప్రారంభించనున్నారు. పరకాల, తొర్రూరు, కొడగండ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు..మంత్రి శ్రీకారం చుట్టనున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ.. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో రూ.900 కోట్ల రూపాయల కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి..నాలుగు రోజులు కూడా గడవక ముందే.. మరోసారి జిల్లాకు వచ్చేస్తున్నారు.

KTR Warangal Public Meeting Today : ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో కేటీఆర్‌ భూపాలపల్లికి చేరుకొని.. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. 15 ఎకరాల విస్తీర్ణంలో..59 కోట్ల 45 లక్షల వ్యయంతో..సకల సౌకర్యాలు, అధునాతన హంగులతో.. ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని.. జిల్లా కలెక్టరేట్ విద్యుద్దీపాలతో ధగధగలాడుతోంది.

Minister KTR Speech in Warangal Tour : పింఛన్ల పెంపు, ఆడబిడ్డలకు సాయంపై త్వరలోనే శుభవార్త: మంత్రి కేటీఆర్

KTR Election Campaign Warangal : భూపాలపల్లిలో కలెక్టర్‌ కార్యాలయంతో పాటు..రూ.25కోట్ల 90లక్షల రూపాయలతో 37ఎకరాల్లో నిర్మించిన.. జిల్లా పోలీస్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారు. పట్టణంలో నిర్మించిన 416 రెండు పడకల గదులను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తారు. అనంతరం.. హనుమకొండ జిల్లా పరకాలలో 4కోట్ల 85లక్షలతో నిర్మించిన మునిసిపాలిటీ, 2కోట్ల 15లక్షలతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, 2కోట్ల 80లక్షల రూపాయతో నిర్మించిన ఆర్డీవో కార్యాలయ భవనాలను మంత్రి ప్రారంభిస్తారు. మరో 114 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కూడా కేటీఆర్ శంకుస్ధాపన చేస్తారు.

KTR Speech at Kamareddy Public Meeting : ఆ కారణంతోనే కేసీఆర్‌.. కామారెడ్డి నుంచి పోటీకి దిగుతున్నారు : కేటీఆర్

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 25కోట్ల రూపాయల మేర పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేస్తారు. తొర్రూరు పర్యటన ముగించుకుని.. జనగామ జిల్లా కొడకండ్లకు చేరుకుంటారు. అక్కడ మినీ టెక్స్ టైల్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాలతో పాటు భూపాలపల్లి, పరకాల, తొర్రూరులో జరిగే బహిరంగసభల్లో.. మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మరోసారి గులాబీ పార్టీకి పట్టం కట్టాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తారు.

KTR Launch Vijaya Mega Dairy Plant at Raviryala : రాష్ట్రంలో పాడి రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు: మంత్రి కేటీఆర్

KTR Anger Over PM Modi Comments in Nizamabad : కేసీఆర్ ఒక ఫైటర్‌... చీటర్‌తో కలవరు: మంత్రి కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.