కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జనతా కర్ఫ్యూని ప్రతి ఒక్కరూ పాటించాలన్న కేసీఆర్ పిలుపు మేరకు వరంగల్ నగరంలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటిస్తున్నారు. ఫలితంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కేంద్రాలు, రోడ్లు వెలవెలబోయాయి.
నిత్యం భక్తులతో కిటకిటలాడే వేయి స్థంభాల ఆలయం భక్తులు లేక బోసిపోయింది. ఓరుగల్లు వాసుల ఇలవేల్పైన భద్రకాళి ఆలయానికి సైతం అర్చకులు తాళం వేశారు. జిల్లా కోర్టు, కలెక్టరేట్ కూడలి నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
ఇదీ చూడండి: జనతా కర్ఫ్యూ'తో ఉత్తర భారతం ఇలా...