వరంగల్ గ్రామీణ జిల్లాలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజులు పూజలందుకున్న అమ్మవారు.. సోమవారం గంగను చేరింది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో దుర్గాదేవి నవరాత్రుల పూజలందుకొని డీజే పాటలు.. కోలాటాల కోలాహలం మధ్య గంగమ్మ ఒడికి చేరింది.
వర్ధన్నపేట ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అందరూ ఆడిపాడి దుర్గాదేవికి వీడ్కోలు పలికారు. కరోనా దృష్ట్యా సాయంత్రం 7 గంటల లోపే జిల్లాలో అన్ని చోట్ల అమ్మవారి నిమజ్జనం పూర్తయింది.
ఇదీ చదవండి: ప్రారంభానికి సిద్ధమవుతోన్న ధరణి పోర్టల్