ETV Bharat / state

100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తోన్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు దారి మళ్లిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో అక్రమంగా నిల్వ చేసిన 100 క్వింటాళ్లకు పైగా రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు.

author img

By

Published : Aug 25, 2020, 7:56 PM IST

hundred quintals ration rice caught at konkapaka in warangal rural district
కొంకపాకలో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామ శివారులోని కేఎన్​ఆర్ రైస్​మిల్లులో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని టాస్క్​ఫోర్సు అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు. 100 క్వింటాళ్లకు పైగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

రైస్​మిల్లు యజమాని కొందరు అక్రమార్కులతో కలిసి పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని దొంగచాటుగా మిల్లులో డంపు చేశారని చెప్పారు. రైస్ మిల్లు యజమాని సహా పలువురు వ్యక్తులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్నట్లు టాస్క్​ఫోర్స్ అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.