ఎలాంటి తరుగు లేకుండా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లో రైతులు రాస్తారోకో చేశారు. పదిహేను రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు.
రెండు గంటల పాటు జరిగిన రాస్తారోకోతో కొత్తగూడ-నర్సంపేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నర్సంపేట ఆర్డీఓ పవన్ కుమార్ వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తారని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత