వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు 1626/2 సర్వే నెంబరులోని భూమిని నిరు పేదలకు కేటాయించాలని దళితులు ఆందోళనకు దిగారు. గుడారాలు వేసి తమకు తక్షణమే భూ కేటాయింపు జరపాలని నినదించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అధికారులు గుడారాలను తొలగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గూడులేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని స్థానిక తహసీల్దార్‌తో బాధితులు వాగ్వివాదానికి దిగారు. జిల్లా కలెక్టర్ స్పందించి స్థలాలు కేటాయించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Mallanna Sagar reservoir : మల్లన్న సాగర్‌కు నీటి పంపింగ్ నిలిపివేసిన అధికారులు