ETV Bharat / state

'ఎమ్మెల్యే చల్లా అభివృద్ధి చెందారు తప్పా.. నియోజకవర్గం కాదు' - తెలంగాణ వార్తలు

పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. తెరాస తరఫున గెలుపొందిన వ్యక్తుల వైఫల్యాలను ఎండగడుతూ ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి ఏం లేదని.. కేవలం ఆయనే అభివృద్ది చెందారని ఆరోపించారు.

congress election campaign,  parkal municipal by election
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం, పరకాల మున్సిపాలిటీ ఉపఎన్నిక
author img

By

Published : Apr 25, 2021, 3:11 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ ఇనగాల వెంకట్రాం రెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దార్న వేణుగోపాల్ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస పార్టీ తరఫున గెలుపొందిన వ్యక్తులు అభివృద్ధి చేయకుండా... స్వలాభం చూసుకున్నారని ఆరోపించారు. భవనాల అనుమతుల కోసం డబ్బులు వసూలు చేస్తూ ఎంతో మందిని ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు.

నియోజకవర్గానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసింది ఏం లేదని విమర్శించారు. చల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్​కి లాభం తీసుకొచ్చే పనులే చేపట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే బాగా ఎదిగారు తప్పా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదని ఆరోపించారు. ఈ ఒక్కసారి కాంగ్రెస్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, ఎన్నికల సమన్వయ కమిటీ అధ్యక్షులు దుబాసి వెంకటస్వామి, మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి, మంద రామచందర్, బొమ్మకంటి చంద్రమౌళి, మంద రామేశ్వర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ మేయర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.