వరంగల్ గ్రామీణ జిల్లాలో నేరాల నియంత్రణకు స్థానికుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కేవలం అలంకారప్రాయంగా మారాయి. రాయపర్తి మండలంతో పాటు కొండూరు, కాట్రపల్లి, పెరికేడు గ్రామాల్లో వేలాది రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన నిఘానేత్రాలు గత కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. కనీసం వాటిని మరమ్మత్తు చేసేందుకు సైతం అధికారులు ముందుకురావడం లేదు. సీసీ కెమెరాల ఏర్పాటుచేసే సమయంలో చూపినంత ఉత్సాహం ప్రస్తుతం లేదని పలువురు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: