డబుల్ బెడ్ రూమ్‌ల(Govt Double bedrooms) కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగింది. అర్హుల్లో తెరాస కార్యకర్తలకు మాత్రమే ఇళ్లను పంపిణీ చేశారంటూ చింత నెక్కొండ గ్రామ ప్రజలు వాపోయారు. అసలైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల పంపిణీని మళ్లీ నిర్వహించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
తహసీల్దార్ మహబూబ్ అలీ, పలువురు అధికారుల ఆధ్వరంలో గ్రామంలో నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లక్కీ డ్రాను నిర్వహించారు. సుమారు 400 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 100 మందికి డ్రా జరిపి, 50 మందికి ఇళ్లను కేటాయించారు. అయితే పంపిణీలో పారదర్శకత లేదన్న బాధితులు.. అధికార పార్టీ కార్యకర్తలకే ఇళ్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: cheating: నకిలీ పత్రాలు సృష్టించి కోట్లు కొల్లగొట్టారు