మూడో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టిందని అక్రమంగా దత్తత ఇవ్వాలనుకున్న క్రమంలో విషయం తెలుసుకున్న బాలల సంరక్షణాధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో జగింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామోజీ తండాకు చెందిన గుగులోతు సురేశ్, మంజుల దంపతులకు వర్ధన్నపేటలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో ఆడ శిశువు జన్మించింది. గతంలో ఇద్దరు ఆడ పిల్లలున్నారు. మూడో సంతానం కూడా ఆడపిల్ల కావడం వల్ల అక్రమంగా మరొకరికి దత్తత ఇవ్వాలనుకున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న బాలల సంరక్షణాధికారులు మహేందర్‌రెడ్డి, ఐసీడీఎస్ అధికారులు ఆస్పత్రికి చేరుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్రమంగా దత్తత ఇవ్వడం నేరం అన్నారు. అక్రమంగా దత్తత ఇస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. అనంతరం దత్తత నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: అమ్మో కూర'గాయం'... వాటి కంటే పచ్చళ్లు నయం