ETV Bharat / state

150 అడుగుల జాతీయ జెండా ఏర్పాటుకు రంగం సిద్ధం

author img

By

Published : Jul 1, 2019, 8:33 AM IST

చూడగానే దేశభక్తి పెంపొందేలా వరంగల్​ మహా నగరంలో 150 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయనున్నారు. మేయర్​ గుండా ప్రకాశ్​రావు సూచనతో ఇందుకు అనువైన స్థలం కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. బల్దియా సాధారణ నిధుల నుంచి రూ. 26 లక్షలు కేటాయించేందుకు రంగం సిద్ధమైంది.

జాతీయ జెండా

వరంగల్‌ మహా నగరంలో 150 అడుగుల జాతీయజెండా రెపరెపలాడనుంది. మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు సూచనతో జాతీయ పతాకాన్ని అనువైన కూడలిలో ఏర్పాటు చేసేందుకు వరంగల్‌ మహా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. భారీ జెండాను చూసిన వెంటనే జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంచేలా ఉండాలని, అందుకు అనువైన స్థలాన్ని అధికారులు అన్వేషిస్తున్నారు. బల్దియా సాధారణ నిధుల నుంచి రూ.26 లక్షలను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. వరంగల్‌ రైల్వేస్టేషన్‌, పోచమ్మమైదాన్‌లోని రాణిరుద్రమ కూడలి, బల్దియా ప్రధాన కార్యాలయం, భద్రకాళి బండ్‌, హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్‌ స్థలాలు ప్రాథమికంగా పరిశీలనలో ఉన్నాయి.

ఇదీ చూడండి : గూడ్స్ రైలులో చెలరేగిన మంటలు

Intro:కొరవడిన అధికారుల పర్యవేక్షణ.
అధికారుల పర్యవేక్షణ లోపంతో చెరువు పునర్నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది. పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు ముగియకముందే ఎక్కడికక్కడ పగుళ్ళు ఏర్పడ్డాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ "మన ఊరు మన చెరువు" లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని తమ చెరువు పునరుద్ధరణ పనులతో మినీ ట్యాంకుబండ్ గా ఆధునీకరణ చేయాలని నిర్ణయించి 2016 జూలై లో పనులు ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలోపు పనులు పూర్తి కావాలి, కానీ నత్తనడక పనులతో నేటికి మూడు సంవత్సరాలు దాటిన పనులు పూర్తి కాక నిలిచిపోయింది. చెరువు పనుల్లో లో నాణ్యత లోపించి ఎక్కడికక్కడ పగుళ్ళు దర్శనమిస్తున్నాయి. మట్టి కట్ట కుంగి పోయింది. మెట్లు, మత్తడి, కట్ట ఇరువైపులా రక్షణ గోడకు లెక్కలేనన్ని పగుళ్ళు ఏర్పడ్డాయి.
ఈ చెరువు కట్టకు ఆనుకొని వెలిసిన దేవాలయాలలో ఈ కట్ట మట్టి వర్షానికి జారీ భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ కట్ట కింది భాగంలో ఉన్న చిన్న పిల్లల పార్కులో మట్టి జారి ఇ పిల్లలు ఆడుకోవడానికి భయపడుతున్నారు. ఈ చెరువు కట్టపై ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. రాత్రి వేళల్లో లో ఈ కట్టపై మందుబాబులు ఇష్టారాజ్యంగా తాగి పడేసిన సీసా ముక్కల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కట్ట చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో లో ఉండే ప్రజలు ఈ మందుబాబుల అలా వికృత చేష్టల వల్ల భయాందోళనలకు గురవుతున్నామని తెలుపుతున్నారు. చెరువులో చెత్తాచెదారం వేయడం వల్ల పందులు స్వైర విహారం చేస్తూ రోగాలు ప్రబలే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి త్వరితగతిన చెరువు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.