జిల్లాలో కొత్త నర్సరీల ప్రక్రియను పూర్తి చేయడం, హరితహారం కింద నిర్మించిన వాచ్ అండ్ వార్డులకు తక్షణమే చెల్లింపులు చేయాలని వనపర్తి జిల్లా పాలనాధికారి యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. కొత్త నర్సరీల పెంపు, విత్తనాలు నాటడం వంటి పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
అంతేకాకుండా క్రమేటోరియంలకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తిచేయాలన్నారు. ఇంకా ఎక్కడైనా సోలార్ ప్లానెట్ ఏర్పాటు చేయాల్సి వస్తే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ , డీఆర్డీవో కోదండరాములు, జెడ్పీటీసీ, ఈవో నరసింహులు హాజరయ్యారు.