పదోతరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష జిల్లా అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన తన ఛాంబర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు.
పరీక్షా కేంద్రాల ముఖ్య నిర్వాహకులు, అధికారులు ప్రతి గదిలో 12 మంది విద్యార్థుల చొప్పున కొవిడ్ నిబంధనలను అనుసరించి భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ప్లాన్ చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలో గతంలో ఉన్న 35 పరీక్ష కేంద్రాలకుగానూ అదనంగా 35 పరీక్షా కేంద్రాలను మొత్తం 70 కేంద్రాల ద్వారా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఏఎస్పీ జాకీర్ హుస్సేన్, డీఈవో సుశీంధర్ రావు, ఆర్డీవో చంద్రారెడ్డి హాజరయ్యారు.
ఇవీ చూడండి: డిగ్రీ, పీజీ విద్యార్థులకు పరీక్షలు లేకుండా తాత్కాలికంగా ప్రమోట్!