వనపర్తి జిల్లా కొత్తకోటలో పలు దేవాలయాలు, పాఠశాలల్లో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మిదేవి పూజలు నిర్వహించారు. వివిధ పాఠశాలల్లో విద్యార్థిని ,విద్యార్థులు పూజల్లో పాల్గొన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పెద్దఎత్తున వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు వినయం, భక్తి అలవరచుకోవాలని పాఠశాలల్లో వరలక్ష్మి పూజలు చేపట్టినట్లు అధ్యాపకులు వివరించారు. ఉదయం నుంచి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ దర్శనమిచ్చాయి.
ఇవీ చూడండి: ఇకపై వ్యవసాయానికి మాత్రమే వ్యవసాయ రుణాలు