వనపర్తి జిల్లా అమ్మాయిపల్లి సమీపంలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపక్కన పొలంలోని చెత్తలో పడేశారు.
పాప ఏడుపు గమనించిన అటుగా వెళ్తున్న గ్రామస్థులు పోలీసులకు, ఆశా కార్యకర్తకు సమాచారం అందించారు. వారు వచ్చి శిశువును వనపర్తి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి : గుండెపోటుతో తెరాస నేత మృతి.. మంత్రి సత్యవతి కంటతడి